Srisailam:ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

15
- Advertisement -

శ్రీశైలంలో యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 18న ముగియనున్నాయి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు . ఈ సాయంత్రం 5 .30గంటల నుండి అంకురారోపణ ధ్వజారోహణ కార్యక్రమాలు జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామి అమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు నిర్వహించనున్నారు.

12వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఆర్జిత మరియు ప్రత్యక్ష పరోక్షసేవలైన రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయహోమం, గణపతి హోమం, (పరోక్షసేవ) శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి కల్యాణం మరియు శ్రీ స్వామిఅమ్మవార్లకల్యాణం, ఏకాంతసేవ నిలుపుదల చేశారు.

14వ తేదీన ఉదయం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవిఅలంకార మండపంలో సామూహిక భోగిపండ్ల కార్యక్రమం,15వ తేదీన మహిళలకు ముగ్గుల పోటీలు, కనుమ రోజున సంప్రదాయబద్దంగా గో పూజ నిర్వహించనున్నారు.

Also Read:బాలయ్య సినిమా వర్కౌట్ అవుతుందా?

- Advertisement -