కాచిగూడ ట్రైన్ యక్షిడెంట్..లోకో పైలెట్ క్షేమం..

355
loco pailtet

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో రైలింజన్‌లో ఇరుక్కున్న లింగంపల్లి-ఫలక్‌నుమా ట్రైన్‌ లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ను రెస్క్యూ టీమ్‌ సురక్షితంగా బయటకి తీసింది. సుమారు 8 గంటల పాటు సాగిన రెస్య్యూ ఆపరేషన్‌ ఎట్టకేలకు విజయవంతమైంది.

kachiguda

ఉదయం రెండురైళ్లు ఢీకొనడంతో శేఖర్‌ ఇంజిన్‌ క్యాబిన్‌లో ఇరుక్కున్నాడు. తీవ్రంగా గాయపడిన శేఖర్‌ను వెంటనే నాంపల్లి కేర్‌ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడు చికిత్సకు స్పందిస్తున్నాడని వైద్యులు తెలిపారు. రైళ్లు ఢీకొనడంతో ఈ మార్గంలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.