కార్తీకదీపం..అంజీని కాపాడిన కార్తీక్!

229
karthik
- Advertisement -

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ‘కార్తీకదీపం’. ఇప్పటివరకు 1110 ఎపిసోడ్స్‌ పూర్తిచేసుకోగా తాజా ఎపిసోడ్‌లో భాగంగా అంజిని కార్తీక్ కాపాడగా మోనిత ఎపిసోడ్‌లో దర్యాప్తు ముమ్మరమైంది.

మోనిత సూర్యాపేట వెళ్లి అంజిని బెదిరిస్తుండగా ఫోన్‌లో వీడియో తీస్తుంది దీప. రేయ్ అంజీగా నా పెళ్లికి ముందు నిన్ను చంపితే నా పెళ్లి ఆగిపోతుందని నేను నిన్ను చంపుకుండా తీసుకుని వెళ్తున్నా అంటూ గన్‌తో బెదిరిస్తూ అంజీ లాక్కుని పోయే సీన్ మొత్తం దీప రికార్డ్ చేస్తుంది. తర్వాత సీన్ కట్ చేస్తే మోనితతో ప్రియమణి.. అమ్మా మీ కోసం నిన్న కార్తీక్ అయ్య వచ్చారు అని తెలపగా ఆలోచనలో పడుతుంది మోనిత.

ఇక దీప గురించే ఆలోచిస్తూ నిద్రపోతాడు కార్తీక్. ఇంతలో దీప రావడంతో.. ఎక్కడికి వెళ్లావ్.. అంటూ రాత్రి జరిగిందంతా చెబుతాడు. కానీ దీప మాత్రం ఏం చెప్పదు.. మీరు బ్రష్ చెయ్యడం టిఫిన్ పెడతాను అంటుంది. ఇక భాగ్యం మోనితని మాయమాటలు చెప్పి.. 25 తారీఖున పెళ్లి జరకుండా ఇంటికి తీసుకుని వెళ్లి కిడ్నాప్ చెయ్యాలని అనుకుంటుంది. మోనిత దగ్గరకు వెళ్లి మా అల్లుడు కార్తీక్ నిన్ను చంపడానికి కత్తితో తిరుగుతున్నాడు అని అబద్దం చెబుతుంది.

దీంతో మోనిత భయపడుతుంది. నువ్వు సేఫ్‌గా ఉండాలంటే నాతో పాటు రా అంటూ భాగ్యం ఒప్పిస్తుంది. అయితే భాగ్యం తను చెప్పే అబద్దంలో.. అంజీ మ్యాటర్ తేవడంతో అదంతా అబద్దం అని మోనితకి అర్థమైపోయింది. దాంతో రివర్స్‌లో మోనిత డ్రామా స్టార్ట్ చేస్తుంది. మీతో వస్తాను పిన్నిగారు.. బట్టలు సద్దుకుని వస్తాను అం నమ్మించి గదిలోకి తీసుకుని వెళ్తుంది.

ఇక కార్తీక్‌…దీపను రాత్రి ఎక్కడికి వెళ్లావు అని పదేపదే అడగడంతో అంజి ఉండే చోటును చెబుతుంది. దీంతో కార్తీక్ అంజీని చూసి షాక్ అవుతాడు.అప్పటికే తప్పించుకోనే ప్రయత్నంలో ఉన్న అంజీ.. ద్రాక్షరామం రౌడీని కొట్టి.. తలుపు తీస్తాడు. మోనిత కిడ్నాప్ చేసిన విషయం చెబుతాడు. సీన్ కట్ చేస్తే.. మోనితకి అంజీ తప్పించుకున్నాడనే విషయం ఫోన్‌ ద్వారా తెలుస్తుంది.

- Advertisement -