దేశంలో 24 గంటల్లో 42,982 కరోనా కేసులు

101
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 42,982 కరోనా కేసులు నమోదుకాగా 533 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,18,12,114కు చేరగా ప్రస్తుతం దేశంలో 4,11,076 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుండి ఇప్పటివరకు 3,09,74,748 మంది బాధితులు కోలుకోగా 4,26,290 మంది మృత్యువాతపడ్డారు. టీకా డ్రైవ్‌లో భాగంగా 48,93,42,295 డోసులు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.