మానవతావాది..బసవేశ్వరుడు

17
- Advertisement -

మానవతావాది, సంఘసంస్కర్త, కుల, మత, వర్గ, వర్ణవ్యవస్థను రూపుమాపడానికి నిర్విరామ కృషి చేసిన దార్శనికుడు బసవేశ్వరుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు.

మహిళా సాధికారత కోసం, బడుగు బలహీనవర్గాల సమానత్వం కోసం, అస్పృశ్యత నివారణ కోసం, మత ఛాందస వాదులను వ్యతిరేకించిన మహనీయుడు ఆయన అని కొనియాడారు. బసవేశ్వరుడి స్ఫూర్తి అందరికీ చాటేలా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారు బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు అన్నారు.

హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్‌పై బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అని గుర్తు చేశారు.కోకాపేటలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో బసవ భవన్‌ నిర్మాణానికి రూ. 10 కోట్లు కేటాయించారు. సమ సమాజ స్థాపనకు బాటలు వేసిన బసవేశ్వరుడు చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అన్నారు హరీష్.

Also Read:Nani:యుఎస్‌లో ‘హిట్ 3’జోరు!

- Advertisement -