జెఫ్ బెజోస్‌ని బీట్ చేసిన బెర్నార్డ్ ఆర్నాల్ట్..

203
LVMH
- Advertisement -

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు 72 ఏళ్ల బెర్నార్డ్ ఆర్నాల్డ్. ఇప్పటివరకు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఉండగా ఆయన్ని వెనక్కినెట్టి బెర్నార్డ్ ముందువరుసలో నిలిచారు. బెర్నార్డ్ ఫ్రెంచ్ ఇన్వెస్టర్, బిజినెస్ మ్యాన్, ఆర్ట్ కలెక్టర్. ప్రపంచంలోనే అతి పెద్ద లగ్జరీ గూడ్స్ కంపెనీ LVMH Mote Hennessy కి చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్.

జెఫ్ బెజోస్ సంపద నికర విలువ ఒక రోజులో 13.9 బిలియన్ డాలర్లు పడిపోవడంతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా బెర్నార్డ్ నిలిచారు. బెర్నార్డ్ వయసు 72ఏళ్లు. LVMH లో ఆర్నాల్డ్ కు 47శాతం వాటా ఉంది. దాని మార్కెట్ కాపిలైజేషన్ విలువ 402.9 బిలియన్ డాలర్లు. LVMH స్టాక్ విలువ 35శాతం పెరిగింది. 2020 మార్చి నుంచి దాని విలువ 140శాతం పెరిగింది.

ప్రస్తుతం బెర్నార్డ్ సంపద 186.3 బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం జెఫ్ బెజోస్ సంపద కన్నా 300 మిలియన్ డాలర్లు, టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలన్ మస్క్ సంపద కన్నా 147.3 బిలియన్ డాలర్లు ఎక్కువ. గతంలోనూ బెర్నార్డ్ పలుమార్లు ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.

- Advertisement -