కార్తీక దీపం…మోనితకు ట్విస్ట్ ఇచ్చిన అంజి!

71
monitha

బుల్లితెర పాపులర్ సీరియల్ కార్తీకదీపం విజయవంతంగా 1104 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా కార్తీక్‌ని పెళ్లి చేసుకోవాలని ఆశ పడ్డ మోనితకు బ్రేక్‌లు వేశారు అంజి. రిజిస్టర్ ఆఫీస్‌కి ఫోన్ చేసి పెళ్లి ఆపాలని చెప్పడంతో మోనిత షాక్‌ తింటుంది.

ఇక ముందుగా భాగ్యం…. మోనిత నాటకాలను గుర్తు చేసుకుంటూ.. ఏమేందే దానికి? అసలు అలా ప్రవర్తిస్తోంది ఏంటీ అంటూ దీపతో బాధగా అంటుంది. దానికి నా భర్త మీద మోజు పిన్నీ.. దానికి ప్రేమ అని అందమైన పేరు పెట్టుకుని తిరుగుతోందని చెబుతుంది దీప. ఇక తెల్లారే సరికి దీప రెడీ అవుతూ ఉండగా ఎక్కడికి రెడీ అవుతావని పిల్లలు అడగ్గా తాతాయ్య డిశ్చార్జ్‌ అవుతున్నారని చెబుతుంది.

పిల్లలు మేము వస్తాం అనగా నక్లెస్ రోడ్డులో ఫ్లవర్స్ ఎగ్జిబిషన్ పెట్టారట..వారణిసి ఆటోలో వెళ్లి చూసి రండీ.. మంచి మొక్కలు కొని తెచ్చుకోండి.. అవి పువ్వులు పూసేలోపు మీకు గుడ్ న్యూస్ చెబుతాను అంటుంది దీప. సంబరంగా సరేనంటారు పిల్లలు.

ఇక మోనిత నిద్రలేవకముందే రిజిస్టర్ దుర్గాప్రసాద్ కాల్ చెయ్యడంతో ప్రియమణి నిద్రలేపి ఫోన్ అందిస్తుంది. మేడమ్.. మీరు కార్తీక్ గారు చేసుకోబోయే పెళ్లికి ఒకరు వ్యతిరేకత తెలిపారు. అతడి పేరు అంజి అంట.. మేడమ్ అతడ్ని 25లోపు ఒప్పిస్తేనే.. మీ పెళ్లి జరుగుతుంది అంటూ మోనితకి చెప్పడంతో షాక్ తింటుంది. దీపా నిన్ను తక్కువ అంచనా వేసి తప్పు చేశాను.. లాభం లేదు.. త్వరగా ఏదొకటి చేసి అనుకున్న డేట్‌కి పెళ్లి చేసుకుని తీరతాను అని మనసులో రగిలిపోతుంది.

ఇక ఆనందరావుని ఆదిత్య ఇంటికి తీసుకురాగా దీప సంతోషంగా ఎదురొచ్చి హారతి తీస్తుంది. తర్వాత కార్తీక్ మీద ఆయనకి జాలి కలిగేలా నమ్మకం కలిగేలా మాట్లాడుతుంది. దాంతో ఆదిత్య పైకి లేచి దీపకు దన్నం పెట్టి వెళ్లిపోతాడు. ఇక కార్తీక్ శూన్యంలోని దీర్ఘంగా ఆలోచిస్తూ.. నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు.

అంజి రిజిస్టర్ ఆఫీస్‌కి ఫోన్ చేసి మరీ ఈ పెళ్లికి అభ్యంతరం చెప్పడమేంటీ? నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయా? అని ఆలోచిస్తారు కార్తీక్. తర్వాత ఏసీపీ రోషిణి కాల్ చేసి..మీరొకసారి రండీ మాట్లాడాలి.. అనేసి మోనిత మాట కూడా వినకుండా పెట్టేస్తుంది. ఇంతలో దీప ఎంట్రీ ఇవ్వడంతో మోనిత మరింత ఇబ్బందుల్లో పడుతుంది. ఇక ఇవాల్టీ ఎపిసోడ్‌ మరింత ఆసక్తికరంగా ఉండనుంది.