దీప-కార్తీక్ ప్రేమ తాంబూలం.. మోనితకు మంటలు!

123
karthik

బుల్లితెర పాపులర్ షో కార్తీక దీపం 1106 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోగా తాజాగా ఎపిసోడ్‌లో మోనితకు మళ్లీ షాక్ తగిలింది. అంజి ఎంట్రీతో పాత కేసులను తిరగతోడేందుకు ఏసీపీ రోహిణి సిద్ధం కాగా దీప- కార్తీక్ ప్రేమ తాంబూలంతో ఎపిసోడ్ అలా సాగిపోయింది.

తొలుత రోషిణి తనని మాత్రమే పిలిస్తే దీప తనకు అబద్దం చెప్పి విచారణకు తను కూడా వచ్చిందని మోనిత టెన్షన్ పడుతుంది. అంజీ ఎవరు? , అంజీ నువ్వు ప్రేమించుకున్నారా? పె అంటూ మోనితకు రోషిణి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. డ్రైవర్‌కి నాకు స్నేహమేంటీ.. ప్రేమేంటి అనడంతో.. పోనీ పగ ఉందా అని రోషిణి అనడంతో మోనిత కంగుతింటుంది. ఈ క్రమంలో హిమ చనిపోవడానికి ముందే తాను కార్తీక్‌ని ప్రేమించానని చెప్పగా దీపతో మాట్లాడాలని,కేసును తిరగదోడాలని చెప్పి మోనితని పంపించేస్తుంది రోషిణి. అయితే మోనితా.. అంజీ పేరు ఎత్తగానే సెల్ ఫోన్ మరిచిపోయి వెళ్లడంతో తిరిగి వెనక్కి వచ్చి ఫోన్ తీసుకుని వెళ్తుంది మోనిత.

మీకు అంజీ ఆచూకి దొరికిందా మేడమ్? అని రోషిణితో దీప మాట్లాడుతున్న మాటలు విని మోనిత షాక్ అవుతుంది. అంజీ ఫోన్ కాల్ అబద్దం అని తేలడంతో మోనిత సంబరాల్లో ములిగిపోతుంది. బిర్యాని వండించుకుని.. డైనింగ్ టేబుల్‌ మీద కూర్చుని.. లెగ్ పీసులు తింటూ పండుగ చేసుకుంటుంది. కార్తీక్‌కి కాల్ చేసి భయపెట్టాలని నిర్ణయించుకుని కాల్ కలుపుతుంది. అయితే దీప, కార్తీక్, పిల్లలు అప్పుడే సౌందర్య ఇంటి నుంచి శ్రీరామ్ బస్తీ ఇంటికి వెళ్తారు.

అంతలో మోనిత ఫోన్ చేయడంతో ఎత్తండి డాక్టర్ బాబు అంటుంది దీప. అంజీలా ఫోన్ చేయించి.. పెళ్లి ఆగిపోయినట్లు అందరినీ నమ్మిస్తోంది.. అసలు ఏం అనుకుంటోంది అంటూనే.. ఏయ్ ప్రియమణీ.. రెండు కిల్లీలు కూడా కట్టి తీసుకునిరా.. అక్కడ టాబ్లెట్స్ తీసుకునిరా అంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంది. కార్తీక్ – దీప ఇద్దరు కలిసి మోనిత ఇంటికి బయలుదేరగా ఈ విషయం తెలియక మాట్లాడుతూనే ఉంటుంది. కాసేపట్లో తనముందు దీప, కార్తీక్ ప్రత్యక్షం కావడంతో . బిత్తరపోతుంది మోనిత.

మనం నవ్వితే అది ఏడుస్తుందేమో అంటూ మోనితకు ఇంక మండేలా చెబుతుంది దీప. హాట్ బాక్స్ మూత తీసి.. బిర్యానీ డాక్టర్ బాబు.. లెగ్ పీసులు కూడా అంటుంది దీప నవ్వుతూ. సెలబ్రేషన్‌లో లాస్ట్ సిగ్మెంట్ అనుకుంటా.. చేసుకోనీ.. అంటాడు కార్తీక్. ఒకప్పుడు నువ్వు మా మమ్మీ మోనిత గురించి చెప్పి నేత్తి నోరు కొట్టుకున్నా నేను కొట్టిపారేసేవాడ్ని. కానీ ఇప్పుడు మీకంటే ఎక్కువగా నాకే తెలిసింది.. మోనితని కొట్టిపడేయాలనేంత కసిగా ఉన్నా సంస్కారం కట్టిపారేస్తుంది అంటాడు కార్తీక్ కోపంగా. తర్వాత డైనింగ్ టేబుల్ మీద ఉన్న తాంబూలాల్లో ఒకటి తీసుకుని కార్తీక్‌కి తినిపిస్తుంది. కార్తీక్‌కి మరొకటి ఇచ్చి తినిపించమంటుంది. కార్తీక్ తినిపిస్తుంటే.. దీప మోనిత వైపు చూస్తూ తింటుంది. మోనితకి కాలిపోతుంది. దీంతో ఎపిసోడ్ ముగిసింది.