కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సిద్దు భీమప్ప న్యామగౌడ అక్కడిక్కడే మృతిచెందాడు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది. గోవా నుంచి బగల్ కోట్ వస్తుండగా తులిసిగిరి వద్ద తన కారు ప్రమాదానికి గురైంది. భీమప్పతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే మర్గంలోనే భీమప్ప మృతిచెందినట్టు తెలిపారు వైద్యులు. భీమప్ప మరణంపట్ల కర్ణాటక సీఎం కూమారస్వామి దిగ్బ్రాంతి తెలియజేశారు. ఉపముఖ్యమంత్రి పరమేశ్వరన్ కూడా ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే సిద్దు భీమప్ప ప్రయాణిస్తున్న కారు బగల్ కోట్ సమీపంలోని తులసిగిరి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఓ ట్రక్ వచ్చింది. ట్రక్ డ్రైవర్ కారును గమనించకపోవడంతో స్పీడ్ గా వస్తున్నాడు. కారు డ్రైవర్ ట్రక్ ను తప్పిద్దామనే క్రమంలో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్ ను బలంగా ఢీకోట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భీమప్పను ఆయన అనుచరులు ఆసుపత్రిలో చేర్చిన గానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈప్రమాదంలో ఎమ్మెల్యే తో పాటు డ్రైవర్ కూడా మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఇక ఇటివలే జరిగిన కర్ణాటక ఎన్నికలలో జామఖండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపోందారు సిద్దు భీమప్ప న్యామగౌడ. బీజేపీ అభ్యర్ధి శ్రీకాంత్ కులకర్ణిపై 2795 ఓట్ల మెజార్టీతో భీమప్ప గెలుపోందారు. కాంగ్రెస్ నిర్వహించిన క్యాంప్ గత 15 రోజులుగా తొటి ఎమ్మెల్యేలతో గడిపారు భీమప్ప. గత మూడు రోజులు క్రిందటే తమ కుటుంబసభ్యలు వద్దకు వెళ్లారు. సిద్దూ భీమప్ప మృతితో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతలు దిగ్ర్బాంతికి గురయ్యారు. పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు , అభిమానులు సిద్దూ భీమప్ప భౌతిక కాయాన్ని సందర్శించేందుకు ఆయన నివాసం వద్దకు వచ్చారు.