జియోకు పోటీగా ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్‌..

262
Airtel
- Advertisement -

రిలయన్స్ జియో ప్రస్తుత టెలికాం రంగానికి చుక్కలు చూపిస్తూ ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తోంది. కళ్లుమిరుమిట్లు గొలిపే జియో ఆఫర్లు చూసి ఇతర నెట్‌వర్క్ కస్టమర్లంతా జియో బాట పడుతున్నారు. జియో ఎఫెక్ట్ ఎలా తట్టుకోవాలో తెలియక ఇతర నెట్‌వర్క్స్ అన్నీ జియో తరహా ఆఫర్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ జియోకు పోటీగా రూ.449 కి ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది.

Airtel

ఇందులో కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు కనుక మొత్తం 140 జీబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. ఇక జియోలో ఇదే తరహాలో రూ.448 ప్లాన్ అందుబాటులో ఉండగా ఆ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 2జీబీ డేటా వస్తుంది. మొత్తం 80 రోజుల వాలిడిటీకి 160 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌కు పోటీగానే ఎయిర్‌టెల్ రూ.449 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

- Advertisement -