Karnataka Polls: మే10న ఎన్నికలు

51
- Advertisement -

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజైంది. మే10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు సీఈసీ రాజీవ్ కుమార్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏప్రిల్ 13న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్లకు చివరి తేదీ: ఏప్రిల్ 20.

ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన ఉండనుండగా ఉపసంహరణకు చివరి తేదీ: ఏప్రిల్ 24. మే 13న ఓట్లను లెక్కించనున్నారు.మే 24తో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగుస్తుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. మొత్తం ఓటర్లు 5.21 కోట్ల మంది అని తెలిపిన ఈసీ..తొలిసారి ఓటర్లు 9.17 లక్షల మంది అని తెలిపారు. వచ్చే నెలలో కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.80 ఏళ్లు పైబడిన వారికి తొలిసారి ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. గిరిజన ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళ, పురుష ఓటర్లు సమానంగా ఉన్నారని తెలిపారు.

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్ధానాలుండగా ఆప్ అన్ని స్ధానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ 124 మంది అభ్యర్థులను ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ నుంచి బరిలోకి దిగుతుండగా, ఆ పార్టీ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆప్ ఇప్పటివరకు 80 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -