జయజానకి నాయక..ట్రెండ్ సెట్టర్

63
- Advertisement -

యంగ్ సెన్సేషన్ బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం జయ జానకి నాయక. బెల్లంకొండ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించగా.. తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ కీలకపాత్రలో నటించారు.

తాజాగా యూ ట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటివరకు 709 మిలియన్ వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించిందని యూ ట్యూబే స్వయంగా వెల్లడించింది.

2017 ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, పాటలు అద్భుతంగా ఉన్నాయి.. రిషి పంజాబి కెమెరా వర్క్ సినిమాకు హైలెట్ అయ్యాయి. కొరియోగ్రఫీ, యాక్షన్ సీన్లు, డాన్స్, డైలాగులు బోయపాటి స్టైల్ లో ఉన్నాయి. కొత్తదనం, భారీ ట్విస్టులు పెద్దగా కథలో లేకపోయినా భారీ తారాగణం,ఖర్చుతో అలా చూస్తూ ఉండిపోయేలా చేయటంలో మాత్రం బోయపాటి విజయం సాధించారు బోయపాటి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -