యూట్యూబ్ ప్రాంకర్‌ను చితకబాదిన కల్యాణి!

14
karate

యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డిని చితకబాదింది ప్రముఖ సినీనటి కరాటే కల్యాణి. ప్రాంక్ పేరుతో మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని నడిరోడ్డుపై అతడిని పట్టుకుని చితకబాదింది. హైదరాబాద్ ఎస్సార్ నగర్ పరిధిలోని మధురానగర్‌లో జరిగిన ఈ ఘటనతో ఇరువురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.

యూ ట్యూబ్‌లో ప్రాంక్ వీడియోలు చేసే శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లిన కల్యాణి.. ప్రాంక్ వీడియోల విషయమై నిలదీసింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని మండిపడగా ఇరువురు మధ్య మాటమాట పెరిగి గొడవకు దారితీయగా ఈ క్రమంలో శ్రీకాంత్‌పై దాడి చేసింది కల్యాణి.

కల్యాణితో పాటు అక్కడున్న వారు కూడా శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా కల్యాణిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీకాంత్.