హస్తినలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు..

23
ttd

హస్తినలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 వరకు జరిగే బ్రహ్మోత్సవాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.శాస్త్ర‌బద్ధంగా ఉత్స‌వాల‌కు అంకురార్ప‌ణ పూజ చేశారు.

తిరుమ‌ల‌లో మాదిరే ఢిల్లీలోనూ శాస్త్ర‌బ‌ద్ధంగా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తామ‌ని సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుప‌తి ఎంపీ గురుమూర్తి, టీటీడీ స‌ల‌హా మండ‌లి చైర్మ‌న్ ప్ర‌శాంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. రోజుకు 50 నుండి 60 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కలు చెల్లిస్తున్నారు.