పారిపోను…పరుగెత్తిస్తా: కరాటే కల్యాణి

62
karate kalyani
- Advertisement -

తాను ఎక్కడికి పారిపోలేదని..అయినా తాను పరుగెత్తించే రకం కానీ పారిపోయే రకం కాదని తేల్చిచెప్పారు కరాటే కల్యాణి. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన ఆమె…ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారో తనకు తెలుసని చెప్పారు. అన్యాయం జరిగితే సహించని వ్యక్తిత్వం ఉన్న తననే అన్యాయం చేశావంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన ఇంట్లో పిల్లలు శివాజీ, ఝాన్సీలా పెరగాలని ఆలోచిస్తానని.. తప్పు చేసి ఉంటే క్షమాపణ కోరటానికి సిద్ధమని అన్నారు. తాను పిల్లల్ని ఎత్తుకెళ్లి అమ్ముకుంటున్నానా అని ప్రశ్నించారు. కావాలంటే చచ్చిపోతానని.. కానీ ఒక్క ఆడదాన్ని ఎదుర్కోలేక ఇలాంటివి చేస్తారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను పిల్లల్ని అమ్ముకునే స్థితిలో లేనని స్పష్టం చేశారు. తనకు ఉన్నా లేకపోయినా ఇతరులకు సాయం చేస్తానని తెలిపారు. నాకు ప్రాబ్లెమ్ అయి పిల్లలు పుట్టలేదు కాబట్టి పిల్లలు కావాలని కోరుకుంటే తప్పా అని ప్రశ్నించిన కల్యాని…ఇకపై పాప తల్లిదండ్రులు తనతోనే ఉంటారని వెల్లడించారు.

- Advertisement -