పవర్‌ స్టార్‌తో కన్నడ స్టార్‌..

94
sudeep

కన్నడ స్టార్‌ హీరో కిచ్చ సుదీప్ మంగళవారం టాలీవుడ్ హీరో పవర్‌ స్టార్‌, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. హైదరాబాద్ వచ్చిన కిచ్చ సుదీప్… పవన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పవన్‌ను కలిసిన సందర్భంగా కిచ్చ సుదీప్ మొక్కలను బహూకరించారు. ఇటీవలే సినిమా చిత్రీకరణలు ఊపందుకున్న క్రమంలో తాను నటిస్తున్న కొత్త సినిమాల గురించి పవన్‌కు వివరించారు సుదీప్‌.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపైనా, సామాజిక అంశాలపైనా వీరి మధ్య చర్చ జరిగింది. దాదాపు గంట పాటు వీరి చర్చ కొన్నసాగినట్లు తెలుస్తోంది. ఈ భేటీపై కిచ్చ సుదీప్ ట్విట్టర్‌లో స్పందించారు. ఎంతో నిరాడంబరంగా, ఎంతో నిగర్వంగా ఉండే మనిషి పవన్ కల్యాణ్, ఆయనకు నేను ఫిదా అయ్యాను అంటూ ట్వీట్ చేశారు. మీతో మాట్లాడడం అద్భుతంగా ఉంది సర్ అంటూ స్పందించారు.