తమిళ రాజకీయాలకు, సినిమావారికి అవినాభావ సంబంధం ఉంది. సినిమా రంగంలోకి రాజకీయాలను శాసించిన వారేందరో. వారి బాటలోనే సహజనటుడు కమల్ పయనిస్తాడా అంటే ఇప్పుడు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు కమల్ చేసిన ట్వీట్ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది.
తాను కానీ ఓ నిర్ణయం తీసుకుంటే సీఎంను తానేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరూ శాశ్వత రాజులు కాదన్నారు కమల్. నిరాశలో ఉన్న వారికి, ఆశతో ఉన్న తన అభిమానులకు త్వరలోనే ఓ మార్గం దొరుకుతుందని, కొన్నాళ్లు ప్రశాంతంగా ఉండాలని కమల్ తన అభిమానులకు పిలుపునిచ్చారు.
తొలుత కాసేపటిలో ఓ ప్రకటన చేస్తా. అప్పటివరకు ఓపికపట్టండి’ అంటూ తొలుత ఓ ట్వీట్ చేశారు కమల్. ఈ ట్వీట్ పెట్టిన కొద్దిసేపటికే.. ‘నన్ను ఓడిస్తే తిరగబడతా. నేను అనుకుంటే నేనే ముఖ్యమంత్రిని…. రండి.. మూర్ఖులకు వ్యతిరేకంగా పోరాడేవాడే లీడర్’ అని ట్వీట్ చేశారు. అంతేగాదు పళనిస్వామి మంత్రులపై దుమ్మెత్తి పోశారు.
ఈ ఆరోపణలపై తమిళనాడు ఆర్థిక మంత్రి డి.జయకుమార్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే కమల్ చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్యలను కమల్ సీరియస్ గా తీసుకున్నారా? అనే చర్చ జరుగుతోంది. మరోవైపు కమల్ కు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మద్దతు పలికారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని ఆయన అన్నారు.