ప్రభాసే కావాలంటున్న తమన్నా..!

267
Milkybeauty interested in Prabhas
- Advertisement -

బాహుబలి సినిమా ప్రభాస్‌ను దేశవ్యాప్తంగా పరిచయం చేసింది. ముఖ్యంగా టాలీవుడ్‌ జనాలకే కాదు బాలీవుడ్‌ జనాలకు సైతం మన డార్లింగ్ తెగనచ్చేశాడు.  అక్కడి స్టార్‌ హీరోలతో సమానంగా పాపులారిటీ దక్కించుకున్నాడు ప్రభాస్‌. అందుకే ప్రభాస్‌ గురించి పాయింట్‌ టు పాయింట్‌ కథనాలు వండి వడ్డిస్తోంది బాలీవుడ్‌ మీడియా.

ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సాహో సినిమాలో నటిస్తున్న ప్రభాస్…లుక్ మార్చి ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రభాస్‌తో సినిమాలు తీసేందుకు పోటీ పడుతున్నారు.  హిందీలో బాహుబలి రైట్స్ తీసుకున్న దర్శక నిర్మాత కరణ్ జోహర్.. ప్రభాస్ హీరోగా స్ట్రయిట్ హిందీ సినిమా తీయాలని భావిస్తున్నాడు.

Milkybeauty interested in Prabhas
బాహుబలి2 రిలీజ్ తర్వాత సినిమా సాధిస్తున్న రికార్డుల గురించి పక్కన పెడితే.. ఆ చిత్రంలో నటించిన ప్రభాస్, అనుష్కల గురించి చర్చ విపరీతంగా జరిగింది. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత సాహో చిత్రంలో ప్రభాస్ పక్కన అనుష్క నటిస్తున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఇలా రకరకాల వార్తలు జోరు మీద ఉంటే.. తాజాగా ప్రభాస్, తమన్నా గురించి మరో వార్త వెలుగులోకి వచ్చింది.

రెబల్‌ సినిమాలో ప్రభాస్‌తో నటించే అవకాశాన్ని కొట్టేసిన తమ్ము బేబి… బాహుబలిలో తన నటనతో ఆకట్టుకుంది. అందుకెనేమో ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టమని తనతో నటించే అవకాశం ఎట్టి పరిస్ధితుల్లో వదులుకోనని చెబుతోంది మిల్కీ బ్యూటీ. బాహుబలి సినిమా షూటింగ్‌లో యాక్షన్, ఫైట్ సీన్లలో నా భద్రత గురించి ఆలోచించిన తీరు మరువలేనిది. నా హృదయంలో ప్రభాస్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఓ స్నేహితుడి కంటే ఎక్కువగా నా కోసం ఆలోచిస్తాడు అని తమన్నా చెప్పింది.

ఇదిలా ఉండగా, ఖామోషీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత వసు భగ్నానీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా కోరిక మేరకు ప్రభాస్  అతిథి పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నాడట. అయితే ఈ వార్తలపై మాత్రం స్పందించేందుకు ప్రభాస్ నిరాకరించాడు.

- Advertisement -