రేటు తగ్గించిన అందాల చందమామ కాజల్!

64
kajal

అందాల చందమామ కాజల్ అగర్వాల్ తన మనసు మార్చుకుంది. పెళ్లి తర్వాత సినిమాల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్న కాజల్‌…తన రెమ్యునరేషన్‌ని తగ్గించుకుందట. ఇప్పుడు ఈ వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇటీవల పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య మూవీతో పాటు ప్రవీణ్ సత్తారు, నాగార్జున చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే కాజల్ రెమ్యునరేషన్ తగ్గించిందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారగా ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.