‘ఆచార్య’ నుండి కాజల్‌ ఔట్‌.. కొరటాల క్లారిటీ..

89
koratala
- Advertisement -

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ ‘ఆచార్య’. ఇందులో చిరు సరసన కాజల్‌ అగర్వాల్‌ నటించిన విషయం తెలిసిందే. అయితే కాజల్‌ పాత్రకు గురించి దర్శకుడు కొరటాల షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో కాజల్ పాత్ర ఉందా? లేదా? అనే చర్చ జరుగుతుండగా.. మూవీ ప్రమోషన్స్‌లో దీనిపై కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంలో కాజల్ పాత్ర లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కాజల్‌ పాత్రకు ఈ మూవీలో సరైన ప్రాధాన్యత లేదని..ఈ పాత్రలో హీరోయిన్‌ను వాడుకోవడం సరైనది కాదని కొరటాల అభిప్రాయపడ్డారు.

ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని కాజల్ పాత్రను పెట్టడానికి ప్రయత్నం చేశానని కొరటాల తెలిపారు. తొలి షెడ్యూల్ పూర్తయిన తర్వాత అవుట్ పుట్ చూశానని… తనకు సంతృప్తిగా అనిపించలేదని చెప్పారు. ఇందులో చిరంజీవి పాత్రకు ప్రేమపై ఆసక్తి ఉండదని స్పష్టం చేశారు. కాజల్ పాత్రను ఉంచాలా? వద్దా? అనే విషయాన్ని చిరంజీవి గారితో చెపితే… ఆ నిర్ణయాన్ని తనకే వదిలేశారని కొరటాల శివ అన్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని కాజల్‌కు చెప్పానని… ఆమె నవ్వుతూనే స్పందించిందని చెప్పారు. దీంతో, ‘ఆచార్య’ నుంచి కాజల్ పాత్రను పూర్తిగా తప్పించామని కొరటాల అన్నారు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించిందని చెప్పారు.

ఇక ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. తిరు ఛాయా గ్రహణం నిర్వహించారు. మరి ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ ను ఎంత భారీగా రాబడుతుందో చూడాలి.

- Advertisement -