సురవరం గొప్ప సాహితీవేత్త: నిరంజన్ రెడ్డి

25
suravaram

సురవరం సుధారకర్ రెడ్డి సాహితీవేత్తగా, ప్రత్రిక సంపాదుకులుగా , రాజకీయ వేత్తగా వంటి పలు రంగాల్లో రాణించి తెలంగాణ ఖ్యాతిని నలుమూలలా వ్యాపింప జేసిన మహనీయుడ‌ని గుర్తుచేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. శుక్రవారం సురవరం 125వ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని సురవరం పార్క్‌లో ఉన్న కాంస్య విగ్రహానికి జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సాహితీ కళా వేదిక సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…పలు రంగాల్లో తనదయిన శైలిలో ముద్ర వేసుకుని భావితరాలకు సువరవరం ప్రతాప్ రెడ్డి జీవితం మార్గదర్శనం అన్నారు. సురవరం జీవిత చరిత్రపై వనపర్తి సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో రెండు సంపుటాలను తయారు చేస్తున్నామ‌ని, అందులో ఒకదానిని ఇప్ప‌టికే విడుదల చేశామ‌న్నారు.