కాలా..కుక్కకు కళ్లు తిరిగే ఆఫర్‌..!

337
kaala
- Advertisement -

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ధనుష్‌ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌, వండర్‌బార్‌ ఫిలింస్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై పా.రంజిత్‌ దర్శకత్వంలో ధనుష్‌ నిర్మిస్తున్న చిత్రం ‘కాలా’. ఏప్రిల్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుండగా ఇటీవల విడుదల చేసిన టీజర్‌ యూ ట్యూబ్‌ని షేక్ చేస్తోంది. రజనీ డైలాగ్‌లు ఫ్యాన్స్‌కి కిక్కేస్తుండగా విడుదలకు ముందే రికార్డులన్ని బ్రేక్ చేస్తోంది.

ఈ సినిమాలో రజనీ మాఫియా డాన్‌గా కనిపించనుండగా ఫస్ట్ లుక్‌ అదిరిపోయేలా ఉంది. ముఖ్యంగా స్టిల్‌లో రజనీ..కుక్క మీద చేతి వేయడం డాన్‌ పాత్రకు అద్దం పట్టేలా ఉంది. అయితే, ఇప్పుడు ఇదే కుక్క హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే,ఇప్పుడు ఆ కుక్కకు కళ్లు తిరిగే ఆఫర్‌ పలుకుతోంది. దాదాపు రూ. 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఇస్తామంటూ ఆఫర్లు వస్తున్నాయట.

Kaala dog offered Rs 2 croreఅయితే, ఇదేదో ఫారన్‌ కుక్క అనుకుంటే పొరబడినట్లే. చెన్నై రోడ్డులో తిరిగే వీధి కుక్క. కాలా చిత్రం కోసం ఓ కుక్క కావాల్సి రావడంతో దర్శకుడు పా.రంజిత్ అనేక కుక్కలను పరిశీలించిన తర్వాత మణిని ఎంపిక చేసుకున్నాడు. షూటింగ్ జరిగినన్ని రోజులు రజనీ ఈ కుక్కని ఎంతో ప్రేమగా చూసుకున్నాడట. మొత్తానికి సూపర్‌ స్టార్ సినిమా కాలాతో ఓవర్‌ నైట్‌లో మణి రేటు అమాంతం పెరిగిపోయింది. అయితే దీని యజమాని మాత్రం అమ్మే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నాడట.

- Advertisement -