రజనీని సినిమాలు చేయెద్దంటుంన్న ఐశ్వర్య..

182
Rajinikanth

సూపర్‌ స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తెర మీద కనిపిస్తే చాలని భావించే వీరభిమానలకు కొదువే లేదు. సూపర్ స్టార్ గా తమిళ సినిమాను దశాబ్దాలుగా ఏలుతున్న రజనీకాంత్‌ను ఆయన కుమార్తె ఐశ్వర్య ఊహించని కోరిక కోరింది. తన తండ్రి సినిమాలు మానేయాలని ఆమె కోరింది. కాలా సక్సెస్ తో పాటు.. ఈ మూవీలో రజనీ మార్క్ మెరుపులు మెరిపించిన వేళ.. ఇంకా తనలో ఛార్మ్ తగ్గలేదని రజనీ ఫ్రూవ్ చేసుకున్న వేళ..అనూహ్యంగా ఆయన కుమార్తె నోటి నుంచి సినిమాలు మానేయాలన్న కోరిక కోరటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Rajinikanth

తాజాగా మీడియాతో మాట్లాడిన ఐశ్వర్య..నాన్న ఇకపై సినిమాలు మానేసి, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. తన నటన ద్వారా ఎంతో మంది సినీ అభిమానులను అలరిస్తున్న నాన్న… పూర్తిగా ఆ రంగంపైనే దృష్టిని కేంద్రీకరించడం తగదని చెప్పారు.

అయితే ఇప్పటికిప్పుడే సినిమాలను పూర్తిగా వదిలేయాలని తాను చెప్పడం లేదని… క్రమంగా సినిమాలను తగ్గించుకుంటూ, కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని అన్నారు. సంతోషమొస్తే ఎక్కువగా పొంగిపోకూడదని, దు:ఖం వస్తే కుంగిపోకూడదని నాన్న చెప్పే మాటలు తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. సుఖదు:ఖాలను సమానంగా భరించాలనేదే తన తండ్రి సిద్ధాంతమని చెప్పారు. మరి రజనీ కూతురి మాట విని సినిమాలు క్రమంగా తగ్గిస్తో లేదో చూడాలి.