కాలా సీక్వెల్‌..ఛాన్సే లేదు:పా రంజిత్

362
rajanikanth
- Advertisement -

రజనీకాంత్‌తో కబాలి,కాలా చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా మంచిగుర్తింపు తెచ్చుకున్నారు పా రంజిత్. మురికివాడలో సామాన్యుల కష్టాలను తీర్చే నాయకుడిగా రజనీని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఈ సందర్భంగా తమిళనాడు వేలూరు జిల్లా ఆంబూర్‌లో గ్రంథాలయం,రాత్రి పాఠశాలను ప్రారంభించిన రంజిత్ …కాలా సీక్వెల్‌ చేసే అవకాశం లేదన్నారు.

కానీ కాలా కాన్సెప్ట్‌ లాంటి సినిమాలు తెరకెక్కిస్తానని చెప్పారు. జ్యోతిక నటించిన రాక్షసి చిత్రం ట్రైలర్‌ చూశా. బాగా నచ్చింది. అంబేడ్కర్‌ ఆశయాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించడం అభినందించాల్సిన విషయమని పేర్కొన్నారు.

ప్రస్తుతం హిందీలో ‘పిర్సాముండా’,తమిళంలో ‘ఇరండాం ఉలగపోరిన్‌ కడైసి గుండు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు నీలం ఫౌండేషన్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో పలుచోట్ల గ్రంథాలయాలను ప్రారంభించారు.

దళిత రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన కాలా విడుదలైన నాలుగురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను తిరగరాసింది.

- Advertisement -