రికార్డు స్ధాయిలో ‘కాలా’ వ‌సూళ్లు…

285
Kaala
- Advertisement -

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా నటించిన కాలా సినిమా బాక్సాఫిస్ వ‌ద్ద కలెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఈసినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తోంది. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈసినిమాకు ర‌జినీకాంత్ అల్లుడు హీరో ధ‌నుష్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈనెల 7వ తేదిన విడుద‌లైన ఈసినిమా క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతోంది. వివాదాల మ‌ధ్య విడుద‌లైన ఈసినిమాకు అన్ని రాష్ట్ర‌లో మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

kaala

ఇక చైన్నైలో తొలి రోజు నుంచే భారీ వ‌సూళ్లను సొంతం చేసుకుంది కాలా మూవీ. ఒక్క త‌మిళ‌నాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది కాలా.  దేశ వ్యాప్తంగా ర‌జ‌నీకాంత్ ఉన్న క్రేజ్ వ‌ల్ల ఈసినిమా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది.. సినిమా విడుద‌ల‌కు ముందు నుంచే భారీ అంచాన‌ల మ‌ధ్య విడుద‌లైంది.

తెలుగు రాష్ట్ర‌ల్లో తొలి రోజు రూ.3.5 కోట్ల షేర్ ను రాబ‌ట్టింది. ఇక నేడు, రేపు వికెండ్ కావ‌డంతో వ‌సూళ్లు మ‌రింత పెర‌గ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు ట్రేడ్ వ‌ర్గాలు. రజనీ ఛరిష్మా .. నానా పటేకర్ నటనలో సహజత్వం .. హుమా ఖురేషి గ్లామర్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయని అంటున్నారు. గ‌తంలో పా రంజిత్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన క‌బాలి సినిమా భారీ డిజాస్ట‌ర్ ను మూట‌గ‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. మ‌రోసారి ర‌జ‌నీకాంత్ తో సినిమా తీసి భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు పా రంజీత్.

- Advertisement -