ప్రతీ ‌ఒక్కరికీ ధన్యవాదాలు: ఎమ్మెల్సీ కవిత

245
kavitha
- Advertisement -

ఇటీవల జరిగిన ‌నిజామాబాద్ స్థానిక సంస్థల ‌ఉప ఎన్నికలలో కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. 89% ఓట్లు సాధించి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో గురువారం శాసన మండలి ఛైర్మన్ ఛాంబర్ లో కల్వకుంట్ల కవిత ‌ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కవితతో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన టీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ కి, మద్దతు తెలిపిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్య సాగర్, చీప్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు,జీవన్ రెడ్డి, డా.సంజయ్ కుమార్, గణేష్ గుప్తా, జాజిరెడ్డి గోవర్ధన్, షకీల్ అహ్మద్, ఎంపీ కె ఆర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్ ,శేరి శుభాష్ రెడ్డి, ఫరుక్ హుస్సేన్, ఆకుల లలిత, అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహా చార్యులు,నల్గొండ జడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జడ్పిటిసీ, ఎంపిటిసిలు సభ్యులు నేతలు హాజరయ్యారు.

హారతి పట్టి…ఘనస్వాగతం..

ప్రమాణ స్వీకారానికి బయలుదేరే ముందు హైదరాబాద్ లోని స్వగృహంలో, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు హారతి పట్టారు. అనంతరం ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీ వద్దకు చేరుకున్న కవితకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. దీంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మద్దతుగా వచ్చిన వారితో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.

పేరుపేరునా పలకరిస్తూ..

మండలి ఛైర్మన్ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం అనంతరం, తనకు మద్దతుగా వచ్చిన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఎంపీటీసి, జెడ్పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రతీ ‌ఒక్కరినీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యక్తిగతంగా కలిశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, వివిధ సంఘాల నాయకులు ఎమ్మెల్సీ కవితను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలిపారు.

- Advertisement -