తెలంగాణ న్యాయ పోరాటం ఫలించింది..

142
telangana
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం చేసిన న్యాయ పోరాటం ఫలించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న‌ రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం, పోతిరెడ్డిపాడు విస్త‌ర‌ణ‌పై జాతీయ హ‌రిత ట్రిబ్యున‌ల్‌(ఎన్జీటీ) చెన్నై ధ‌ర్మాస‌నం తీర్పు వెల్ల‌డించింది. నిపుణుల కమిటీ రాయలసీమ ప్రాజెక్టుకు ముందస్తు పర్యావరణ అనుమతి అక్కేర లేదు అని సిఫారసుతో కూడిన నివేదిక పూర్తిగా తప్పుడు నివేదిక, అసత్యాలతో కూడుకున్నదని.. కేసును రీఓపెన్‌ చేసి మళ్లీ వినాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్‌జీటీని కోరింది. ఈ మేరకు ఎన్‌జీటీ కేసును రీఓపెన్‌ చేసి రెండు రోజుల పాటు రాష్ట్రాల వాదనలు విన్నది.

తెలంగాణ ప్రభుత్వం తరపున వాదించిన జే రామ చంద్ర రావు వాదనలతో ఏకీభవిస్తు నిపుణుల కమిటీ నివేదకను పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతనే పనులు చేపట్టాలని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు, ఇంజనీర్ల సమష్టి కృషి వలన ఎన్‌జీటీ ఈ తీర్పును ఇచ్చింది. ప్రాజెక్టు డీపీఆర్ స‌మ‌ర్పించి ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు తీసుకోవాల‌ని ఆదేశించింది. తాగునీటితో పాటు సాగునీటి అవ‌స‌రాలు కూడా ఉన్నాయ‌ని ఎన్జీటీ అభిప్రాయ‌ప‌డింది.

- Advertisement -