రాజమౌళికి రాంచరణ్,ఎన్టీఆర్ విషెస్‌..

112
SS Rajamouli

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి ఈరోజు తన 47వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, అజయ్ దేవ్‌గణ్ సహా ఆర్ఆర్ఆర్ టీమ్ జక్కన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు రామ్ చరణ్ కూడా రాజమౌళికి స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలియజేశాడు.

వెరీ హ్యాపీ బర్త్ డే జక్కన్న. లవ్ యూ అంటూ తారక్ ట్వీట్ చేశాడు. క్రిటిక్స్‌కు సైతం ఊహించని విజయాలు రాజమౌళి సొంతం అంటూ.. సినిమాల్లో నా మార్గదర్శి అంటూ రాంచరణ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌, రామ్ చరణ్.. స్వాతంత్య్ర సమరయోధులుగా నటిస్తున్నారు. చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. ఎన్టీఆర్‌ కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు.