జూ. ఎన్టీఆర్ రియల్ హీరో కూడా

49
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ‘గాడ్ ఆఫ్ మాస్’ అంటూ అభిమానులు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ జీవితం నమ్మశక్యం కానిది. అసలు జూ.ఎన్టీఆర్ కి విజయం అంత ఈజీగా రాలేదు. మీకు తెలుసా ? బాల్యంలో నలుగురితో కలవడానికి కూడా ఎన్టీఆర్ భయపడేవాడు. అసలు నలుగురిలో నోరు తెరవడానికి కూడా ఎన్టీఆర్ ఎంతో ఇబ్బంది పడేవాడు. ఐతే ప్రస్తుతం పేజీల కొద్దీ డైలాగులను అలవోకగా చెప్పగలడు. దీని వెనుక జూ. ఎన్టీఆర్ కృషి మాత్రమే ఉంది. పట్టుదలతో తిరుగులేని ఆత్మవిశ్వాసంతో వెండితెర పై కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నిజమైన హీరో జూ. ఎన్టీఆర్.

సినీ నేపథ్యమున్న కుటుంబం అయినా జూ. ఎన్టీఆర్ చిన్నతనంలో ఎక్కువగా ఒంటరిగా గడపాల్సి వచ్చింది. తల్లి షాలిని ఉన్నా.. అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ జూ. ఎన్టీఆర్ తన బాల్యాన్ని గడిపాడు. దీనికితోడు హీరో అయిన తొలిరోజుల్లో అసలు జూ. ఎన్టీఆర్ ను తమవాడిగా సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా భావించేవాళ్ళు కాదు. అయితే, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు జూ. ఎన్టీఆర్. ఆ తర్వాత హీరోగా అందరి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా కూడా రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

Also Read: NTR:మృగాళ్లకు భయాన్ని రుచి చూపించే దేవర…

జూ. ఎన్టీఆర్ తెర పై డ్యాన్స్‌ చేయడం చూస్తే… ‘అబ్బ…ఏం చేస్తన్నాడురా.. అసలు ఒంట్లో ఎముకలు ఉన్నాయా ? లేవా ? అని అందరూ ఆశ్చర్య పోతుండేవాళ్లు. కానీ చిన్నతనంలో జూ. ఎన్టీఆర్ కి వెన్నుపూస సమస్య వచ్చింది. డాక్టర్స్ డ్యాన్స్ చేయలేడన్నారు. నేడు ఇండియన్ కథానాయకుల్లోనే అద్భుతమైన డ్యాన్సర్‌ గా పేరుతెచ్చుకున్నాడు జూ. ఎన్టీఆర్. మా గ్రేట్ తెలంగాణ తరపున జూ. ఎన్టీఆర్ కి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏది ఏమైనా జూ. ఎన్టీఆర్ రీల్ మాత్రమే రియల్ హీరో కూడా.

Also Read: Saindhav:వికాస్‌ మాలిక్‌గా నవాజుద్దీన్ సిద్ధిఖీ

- Advertisement -