జూ.ఎన్టీఆర్‌@ 22యేళ్లు

192
- Advertisement -

నందమూరి తారక రామరావు అనే పేరు సినీ ఇండస్ట్రీలో తెలియని వారుండరు. నందమూరి నటవారసత్వంను పుణికిపుచ్చుకొన మూడవ తరం నటుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జూ.ఎన్టీఆర్‌. తండ్రి అడుగు జాడలో కాకుండా తాత వేసిన మార్గంలో తనదైన నటన ప్రతిభతో దూసుకెళ్తున్నాడు. జూ.ఎన్టీఆర్‌ సినిమా రంగంలోకి వచ్చి నేటితో 22 యేళ్లు పూర్తవుతున్న…తన నటన అభినయంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

జూ.ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఎన్ని హిట్లు ఉన్నాయో అంతకన్నా ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ నటన పరంగా ప్రతీ సినిమాలో ది బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇండస్ట్రీలో చాలా మంది తారక్‌ను సింగిల్‌ టేక్‌ ఆర్టిస్టు అని అంటుంటారు. అంతేకాకుండా తారక్‌ దర్శకుల హీరో అని కూడా అంటుంటారు. పాత్ర గురించి చెప్పడమే లేటు, తారక్‌ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు అంటూ రాజమౌళి ఓ సందర్భంలో వర్ణించాడు. నటుడిగానే కాదు డాన్సర్‌గా కూడా ఎన్టీఆర్‌ ది బెస్ట్‌ అనిపించుకున్నాడు.

జూ.ఎన్టీఆర్‌ చిన్నప్పుడే భరతనాట్యం కూచిపూడీలు నేర్చుకొని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. అయితే సీనియర్ ఎన్టీఆర్‌ తీసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో ఒక చిన్న వేషం ఇచ్చి నటన రంగంలో ఆయన చేత తెరంగేట్రం చేయించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ నటనను చూసి మురిసిపోయిన సీనియర్‌ ఎన్టీఆర్‌ పూర్తి స్థాయిలో సినిమా తీయాలని తన మిత్రుడైన ఎమ్‌ఎస్‌ రెడ్డి చేప్పారు. దాంతో గుణశేఖర్ తో బాల‌ల రామాయ‌ణం సినిమా ఆరు నెలల్లో పూర్తి చేశారు.

1996 ఎప్రిల్‌లో విడుదలైన బాలల రామాయణం ఆఖండ విజయంను నమోదు చేసుకుంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇక వరసగా నిన్ను చూడాలని, స్టూడెంట్‌ నెం.1, సుబ్బు సినిమాలు చేశాడు. కానీ స్టూడెంట్ నెం.1 మంచి విజయాన్ని అందుకోగా మిగిలిన సినిమాలు ఫ్లాప్‌గా నిలిచాయి.2002లో విడుదలైన ఆది సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గేస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం అప్ప‌ట్లోనే రూ.20కోట్ల షేర్‌ను సాధించింది.

ఆది తర్వాత అల్లరి ప్రియుడు నాగ సినిమాలు చేసిన హిట్‌ కాలేదు. 2003లో వచ్చిన సింహాద్రి సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను సాధించింది. ‘ఈ చిత్రంలో తార‌క్ న‌ట‌న‌, డ్యాన్సుల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.‘సింహాద్రి’ త‌ర్వాత పూరి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా’ సినిమా చేశాడు. ఈ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు ఏకంగా 10ల‌క్ష‌ల మంది అభిమానులు వ‌చ్చారు. ఒక ఆడియో ఫంక్ష‌న్‌కు అంత‌టి స్థాయిలో జ‌నాలు రావ‌డం అనేది అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చ‌గా మారింది. 2004లో విడుద‌లైన ఈ చిత్రం భారీ ఫ్లాగ్‌గా మిగిలింది. ఆ త‌రువాత వ‌రుస‌గా ‘నా అల్లుడు’, ‘న‌ర‌సింహుడు’, ‘ఆశోక్’, ‘సాంబ‌’, ‘రాఖీ’ వంటి వ‌రుస ప్లాపులు తార‌క్ క్రేజ్‌ను అమాంతం ప‌డ‌గొట్టేశాయి.

2007లో వచ్చిన యమదొంగ సినిమా కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్‌ రాజమౌళిల కాంబోలో హ్యట్రిక్‌గా నిలిచింది. యమదొంగ త‌ర్వాత ‘కంత్రి’ సినిమా ఫ్లాప్ అవ్వ‌గా ‘అదుర్స్‌’, ‘బృందావ‌నం’ బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు సాధించాయి ఈ రెండు సినిమాలు ఎన్టీఆర్ క్రేజ్‌ను మ‌రింత పెంచాయి. తదుపరి వచ్చిన సినిమా శక్తి ప్రేక్షకులను అందుకోలేక పోయి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఊస‌ర‌వెల్లి’, ‘ద‌మ్ము’, ‘బాద్‌షా’, ‘రామ‌య్య‌వ‌స్తావ‌య్యా’, ‘ర‌భ‌స’ వంటి వ‌రుస ఫ్లాప్‌లు తార‌క్‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయి.

2015లో వచ్చిన టెంపర్‌ సినిమా ద్వారా మంచి కంబ్యాక్ ఇచ్చాడు. దీంతో వరుసగా నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్‌, జైలవకుశ, అరవింద సమేత సినిమాలు వరుసగా విజయాలు సాధించాయి. ముఖ్యంగా చెప్పాలంటే టెంప‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్ క‌థ‌ల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఒక దానికి మ‌రోకటి సంబంధం లేకుండా సినిమాలు చేసి వ‌రుస విజ‌యాల‌ను సాధించాడు.

ఈ యేడాది మార్చి 25న రిలీజైన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంతో తార‌క్ అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న కొర‌టాల శివ‌తో NTR30 చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జురుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. జూ.ఎన్టీఆర్‌ వెండితెరపైనే కాకుండా బుల్లితెర వ్యాఖ్యాతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు బిగ్‌బాస్ వంటి రియాల్టీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు జూ.ఎన్టీఆర్‌.

ఇవి కూడా చదవండి..

త్రిపాత్రాభినయం.. కృష్ణ స్టైలే వేరు!

‘వీరయ్య’ లో విషయముంటుందా ?

కృష్ణ మరణం… ఆ వీడియో వైరల్ !

- Advertisement -