రిలయన్స్ జియో సంస్ధ కొత్త కొత్త ఆఫర్లతో వినియెగదారులను అట్రాక్ట్ చేస్తుంది. తక్కువ ధరకే ఇంటర్ నెట్ ఇవ్వడంతో పాటు కొత్త కొత్త ప్లాన్ లను విడుదల చేస్తున్నారు. దీంతో టెలికం రంగంలో ప్రస్తుతం జియో టాప్ నెంబర్ 1 లో కొనసాగుతుంది. ఇక తాజాగా మరో ప్లాన్ ప్రవేశ పెట్టి జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది జియో సంస్ధ. తన జియోఫై పోర్టబుల్ 4జీ రూటర్‌ను కేవలం రూ.499కే పొందేలా వీలు కల్పించింది. ఇందుకు గాను కస్టమర్లు ముందుగా రూ.999కి జియోఫై రూటర్‌ను కొనుగోలు చేయాలి.
అనంతరం రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను తీసుకోవాలి. లేదంటే రూ.199పైన ఉండే ఇతర పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. తరువాత ఆ ప్లాన్‌లో ఏడాది పాటు కొనసాగితే 12 నెలల అనంతరం రూ.500 క్యాష్‌బ్యాక్‌ను ఇస్తారు. దాన్ని పోస్ట్‌పెయిడ్ బిల్లులో అడ్జస్ట్ చేస్తారు. దీంతో జియోఫై రూటర్ ధర రూ.499 మాత్రమే అవుతుంది. ఇక రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో కస్టమర్లకు నెలకు 25 జీబీ డేటా, అన్‌లిమిటెల్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. వినియోగదారులు జియోఫై రూటర్‌ను జియో స్టోర్, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, ఆన్‌లైన్ సైట్‌లలో కొనుగోలు చేయవచ్చు.