రంగారెడ్డి జిల్లా పాడి రైతుల పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగించింది బిఆర్ఎస్. పాడి రైతుల పెండింగ్ పాల బిల్లుల కోసం పాడిపశువులు, పాడి రైతులతో కలిసి ప్రజాభవన్ ముట్టడికి పాదయాత్రగా బయలుదేరాయి బిఆర్ఎస్ శ్రేణులు
కడ్తాల్ మండల కేంద్రం నుంచి ప్రజా భవన్ కు పాడి పశువులు, పాడి రైతులతో పాదయాత్రగా బయలుదేరాయి బిఆర్ఎస్ శ్రేణులు. మూడు నెలలుగా 6 బిల్లులు రాలేదంటూ ఆందోళన చేపట్టారు రైతులు.
కొన్ని రోజుల క్రితమే శ్రీశైలం హైవేపై పాలు పారబోసి నిరసన తెలిపగా మద్దతు పలికారు బీర్ఎస్ నేతలు. పాల బిల్లులు రాక పశువులను కబేళాలకు తరలించే దుస్థితి వచ్చిందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాడి రైతులు పస్తులు ఉండే పరిస్థితి వచ్చిందంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.
పాడిపశువులతో ప్రజా భవన్ బయలుదేరిన బిఆర్ శ్రేణులను రైతులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బిఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగగా పాడి రైతులను బిఆర్ఎస్ శ్రేణులను, పోలీస్ స్టేషస్‌కు తరలించారు.
Also Read:కాంగ్రెస్..కరెంట్,నీళ్లు, రైతు బంధు రాదు!

