వైఎస్ జగన్‌పై ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన కామెంట్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్ బెదిరించారు అని మండిపడ్డారు. హైకోర్టు స్పీకర్ కు నోటీసులు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం జరిగిందని.. కానీ జగన్ వేసిన పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా అనేది హైకోర్టు నిర్థారణ చేయలేదు అన్నారు.
డిప్యూటీ సీఎం కంటే జగన్ కే ఎక్కువ భద్రత ఉందన్నారు నారా లోకేశ్. ఉపముఖ్యమంత్రికి Z కేటగిరి భద్రత ఉంటే.. జగన్ కు Z+ కేటగిరి సెక్యూరిటీ ఉందన్నారు. ప్రతిపక్ష హోదాపై లోక్‍సభ రూల్స్ లో క్లియర్ గా ఉందని.. గతంలో జగన్ కూడా ప్రతిపక్ష హోదాపై క్లారిటీ ఇచ్చారు.. ఇప్పుడు జగన్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు అన్నారు.
6వ రోజు ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 19 ఏళ్ళు నిండిన మహిళలకు ఆర్థిక సహాయం హామీ అమలుపై చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు శాసన మండలి చైర్మన్.
Also Read:కాంగ్రెస్..కరెంట్,నీళ్లు, రైతు బంధు రాదు!

