నిలకడగా సింగర్‌ కల్పన ఆరోగ్యం

21
- Advertisement -

ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా ఆమెను హుటాహుటిన హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. వైద్యులు ఆమెను వెంటిలేటర్‌ పై ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆస్పత్రికి చేరుకున్న పలువురు గాయనీ, గాయకులు.

ఇక పోలీసులు ఇవాళ కల్పన వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని విల్లాలో ఉంటున్న కల్పన …చెన్నైలో ఉన్న భర్తకు ఫోన్‌ చేసి అపస్మారక స్థితిలోకి వెళుతున్నట్లు చెప్పారు. ఆయన వెంటనే కాలనీ సంఘం ప్రతినిధులకు సమాచారం ఇవ్వగా వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.

Also Read:పాడి రైతులు.. ప్రజాభవన్ ముట్టడి

- Advertisement -