క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ హోం శాఖ‌..జేడీఎస్ ఆర్ధిక శాఖ‌

275
rahul, kumara swamy
- Advertisement -

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్, జేడీఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన విష‌యం తెలిసందే. గ‌త ప‌ది రోజుల క్రితం జేడీఎస్ అధ్య‌క్షుడు కుమార‌స్వామి ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. ఉప‌ముఖ్య‌మంత్రిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఇంత‌వ‌ర‌కూ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేయ‌లేదు. గ‌తంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం కాంగ్రెస్ 24, జేడీఎస్ 12 మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌లే నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్పుడు ఏ ప‌ద‌వి ఏ పార్టీ వారికి ఇవ్వాలో చ‌ర్చ‌లు నడుస్తున్నాయి. మంత్రి ప‌ద‌వుల కోసం ఇరు పార్టీల నేత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

kumara swamy, parameshwaar

ఎవ‌రు ఏ శాఖ తీసుకోవాల‌న్న దానిపై ఇరు పార్టీల మ‌ధ్య అవ‌గాహ‌న కుదర‌క‌పోవ‌డం వ‌ల్లే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఆల‌స్య‌మ‌వుతోంది. కీల‌క‌మైన శాఖ‌లు ఎవ‌రికి ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో ప‌డ్డారు ఇరు పార్టీల నేత‌లు. అయితే మొత్తం మీద ఇరుపార్టీల నేత‌ల ఓ ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ కు హోం శాఖ‌, జేడీఎస్ కు ఆర్ధిక‌శాఖ తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. మంత్రి ప‌ద‌వులు ఎవ‌రికి ద‌క్కుతాయ‌నే విష‌యంపై త్వ‌ర‌లోనే క్లారిటి వ‌స్తుందన్నారు.

JDS-Congress

క‌ర్ణాట‌క‌లోని మంత్రి ప‌ద‌వుల విష‌యంలో ఇప్పటికే ఐడుసార్లు స‌మావేశమ‌య్యారు ఇరు పార్టీల నేత‌లు. హోం శాఖ మ‌రియు ఆర్ధిక శాఖ కీల‌క‌మైన ప‌ద‌వులు కావ‌డంతో చెరో ప‌ద‌వి తీసుకున్న‌ట్లు తెలిపారు జేడీఎస్ నేత డానిష్ అలీ. త్వ‌ర‌లోనే మిగ‌తా మంత్రి పద‌వుల్ని కూడా కేటాయించి ప్ర‌మాణస్వీకారం చేయిస్తామ‌న్నారు. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ అమెరికా ప‌ర్య‌ట‌న నుంచి వ‌చ్చాక నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు.

- Advertisement -