మధ్య ప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్!

346
Shivraj-Singh-Chouhan

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు రాత్రి 9గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది. శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనతో పాటు తన మంత్రివర్గం కూడా కొలువుదీరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈరోజు సాయంత్రం 6గంటలకు భోపాల్ లోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ శాస‌న‌స‌భాప‌క్షం స‌మావేశ‌మై త‌మ నాయ‌కుడిగా శివ‌రాజ్‌సింగ్‌ను ఎన్నుకోనున్న‌ది. కాగా కాంగ్రెస్ కీలక నేత జోతిరాధిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు 22మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. ఇటివలే కమల్ నాథ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.