వెంకీకి జోడిగా హుమా ఖురేషీ..?

234
Huma qureshi and venkatesh
- Advertisement -

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలతో దూసుకుపోతూ వరుసగా అలాంటి చిత్రాలకే మొగ్గుచూపుతున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. గతంలో ‘గురు’ సినిమా తర్వాత ఆయన ఇప్పటి వరకూ ఎలాంటి సినిమాలు చేయలేదు. ఇప్పుడు వెంకీ చేయబోయే సినిమాలు మల్టీస్టారర్ చిత్రాలే కావడం విశేషం. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్‌ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు వెంకీ.

venkash and chaitu

ఇందులో యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌తో కలిసి నటించేందుకు సిద్దంగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు బాబీ(కె.యస్‌. రవీంద్ర) దర్శకత్వంలో మరోక మల్టీస్టారర్‌లో కూడా నటించనున్నాడు. ఈ సినిమాలో అల్లుడు చైతూతో కలిసి నటించేందుకు సిద్దమయ్యాడు. ఇక విషయమేమిటంటే ఈ మూవీలో వెంకీ సరసన బాలీవుడ్ నటీ నటించబోతుందనే వార్త ఊపందుకుంది.

సూపర్ స్టార్ రజినీ ‘కాలా’ సినిమాలో ఆయన ప్రియురాలిగా నటించిన హుమా ఖురేషీ, వెంకటేష్‌ సరసన నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరి ఇంతకు వెంకీకి జోడిగా హుమా ఖురేషీ నటిస్తుందన్న వార్తలో నిజముందా అనేది తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.

- Advertisement -