రాష్ట్ర అభివృద్దిని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు అభినందిస్తున్నరుఃమంత్రి హరీశ్ రావు

221
harishrao

తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్దిని చూసి ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ నేతలు అభినందిస్తున్నారని అన్నారు మంత్రి హరీశ్ రావు. సంగారెడ్డి మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 4 కౌన్సిలర్లు, 400 కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్దిని చూసి కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు.

తెలంగాణ అభివృద్ధి ని చూసి దేశం మొత్తం సీఎం కేసీఆర్ ను అభినందిస్తుంది. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. కరోన వల్ల రాష్టానికి ఆదాయం తగ్గిన పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసామన్నారు.అభివృద్ధి లో దేశానికి తెలంగాణ రాష్ట్రం మోడల్ గా నిలుస్తోంది.తెలంగాణ రాష్ట్ర పథకాలను వేరే రాష్టాలు కాపీ కొడుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తుంటే..కాంగ్రెస్ నాయకులు దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.