ఈ నెల 16న కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం

337
Arvind-Kejriwal

ఈనెల 16న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు అధికారులు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడో సారి అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణం చేయనున్నారు. ఇక కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి బీజేపీ యేతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే పలువురు నేతలకు ఆహ్వానాలు పంపించారని సమాచారం. కాగా నిన్న వెలువడిన ఫలితాల్లో 70సీట్లకుగాను ఆమ్ ఆద్మీ పార్టీకీ 62సీట్లు రాగా, బీజేపీ 8సీట్లకే పరిమితం అయింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఖాతాకూడా తెరవలేదు. మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ కు పలువురు నాయకులు అభినందనలు తెలుపుతున్నారు.