గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న జేడీ లక్ష్మీనారాయణ..

186
JD Lakshmi Narayana

ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక హరితహారానికి మద్దతుగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా టీవీ యాంకర్ ప్రదీప్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి ,ఇందులో పాల్గోవడం చాలా సంతోషంగా ఉందని లక్ష్మీనారాయణ అన్నారు. చెట్లతోనే మనిషి మనుగడ, చెట్లతోనే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. ఇది గ్రహించిన తెలంగాణ సిఎం కెసిఆర్ గత ఆరు సంవత్సరాల నుండి తెలంగాణకి హరితహారం ప్రోగ్రాం చేస్తూ 270 కోట్ల మొక్కలు నాటాలని ఉద్దేశం నిజంగా గొప్పది అన్నారు.

దీనికి కొనసాగింపుగా ఎంపీ సంతోష్ కుమార్ గత మూడు సంవత్సరాలుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశమంతా కొనసాగించడం నిజంగా అభినందనియం. ఇప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో చిన్న, పెద్ద, ధనిక, బీద తేడా లేకుండా దేశం మొత్తం పాల్గొనడం చాలా శుభపరిణామం. ఈ సందర్బంగా ఎంపీ సంతోష్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు జేడీ లక్ష్మీనారాయణ.

ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇలానే కొనసాగేలా నేను మరో ముగ్గురుకి 1. Prof Rajagopal , Ex VC , JNTU SVS.Lakshmi Narayana, Hindu College, Guntur, Kambampati Suresh Chamber of Commerce, Bhadrachalam గార్లకి ఛాలెంజ్ చేశారు.