మెగాస్టార్ మరో రికార్డు..

245
chiru

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో మరో రికార్డు క్రియేట్ చేసారు. చిరంజీవి లాక్ డౌన్ లో సోషల్ మీడియా మాధ్యమాలలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఒకేసారి ట్విట్టర్ – ఫేస్‌బుక్ – ఇన్స్టాగ్రామ్ లలో ఖాతాలు ఓపెన్ చేశారు చిరంజీవి. అయితే మెగాస్టార్ రావడం లేట్ అయినా సోషల్ మీడియాలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు. ఇక ఇంస్టాగ్రామ్ లో ఇప్పటి వరకు 51 పోస్టులు పెట్టిన చిరు లేటెస్టుగా గుండుతో ఉన్న ఫోటో పోస్ట్ చేసి అందరిని సర్ప్రైజ్ చేశాడు.

ఇటీవల చిరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ 1మిలియన్ దాటింది. ఇక మెగాస్టార్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరినీ ఫాలో కావడం లేదు. మరోవైపు ట్విట్టర్‌లో 733.7 K ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన ట్విట్టర్‌లో తన తనయుడు రామ్ చరణ్ ఒక్కరినే ఫాలో అవుతున్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో ప్రవేశించిన ఆరు నెలల్లోపే ఇంత మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకోవడం మాములు విషయం కాదంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు.