ఇప్పుడు తమిళనాట అందరిదీ ఒకే మాట అమ్మ ఆరోగ్యం కుదుట పడాలి..ఆమె క్షేమంగా ఆసుపత్రి నుంచి బయటకు రావాలి. తమిళనాడు ప్రజల ఆరాధ్య దైవంగా వెలిగిపోయిన ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అంతే కాదు అమ్మ పథకాలు అంటూ అక్కడి ప్రజల మనసు దోచుకున్నారు. అమ్మగా జయలలిత తమిళుల గుండెళ్లో గూడుకట్టుకున్నారు .ఇంతగా ఆరాధించే జయలలిత నెలన్నరగా అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు వైద్యులు ప్రకటించారు. అయితే ఉన్నట్టుండి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై కొత్త వార్త వెలుగులోకి వచ్చింది.
అమ్మకు చేతబడి చేశారని,,అందుకే ఉన్నపలంగా ఆనారోగ్యానికి గురైయ్యారనే వార్త తమిళ జనాల్లో భయాందోళనలు కలిగిస్తోంది. లండన్‌కు చెందిన డెయిలీ మెయిల్ అనే పత్రిక ఓ షాకింగ్ న్యూస్ ప్రచురించింది. అమ్మ అనారోగ్యంకు కారణం చేతబడి అని ఆ కథనంలో పేర్కొనడం విశేషం. చేతబడి వల్లే ఆమె ఆరోగ్యం ఇంతగా చెడి పోయిందని, ఆమె కోలుకున్నట్లుగా కోలుకుని వెంటనే అనారోగ్యం బారిన పడుతున్నట్లుగా సదరు కథనంలో పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు తమకీ విషయాన్ని చెప్పినట్లు డెయిలీ మెయిల్ ప్రతిక ప్రకటించింది.
జయలలిత అంటే గిట్టని వాళ్లు,,ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు డెయిలీ పత్రిక అందులో పేర్కోంది. దీంతో తమిళనాడు ప్రజల గుండె గుభేల్ మంది. అమ్మకు ఇలా చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆమె అభిమానులు భయాందోళనను గురౌతున్నారు. మరోవైపు అత్యాధునిక కాలంలో ఈ చేతబడి ఏంటని ఇంకొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా అమ్మ త్వరగా కోలుకోవాలని పూజలు, వ్రతాలు చేస్తున్నారు తమిళనాడు ప్రజలు.