సెలబ్రిటీల…శ్రద్ధాంజలి ట్వీట్లు

142
Tollywood actors mistakely tweets on Jaya death

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులను ఆమెకు చికిత్సనందిస్తున్న అపోలో ఆస్పత్రి ఖండించిన సంగతి తెలిసిందే. జయలలిత కన్నుమూశారంటూ తమిళ వార్తా ఛానళ్లు వార్తలు ప్రసారం చేసి, తిరిగి ఉపసంహరించుకున్నాయి. ఏది జరిగినా ముందు వెనుకా ఆలోచించకుండా సోషల్‌మీడియా వేదికగా స్పందించడం సాధారణ పౌరులకే కాదు పలువురు సెలబ్రిటీలకూ అలవాటుగా మారింది.

వదంతులు నమ్మి నిజంగానే జయలలిత కన్నుమూసిందని పొరపడ్డారు. ఇలా పొరపడిన వారిలో తెలుగు సినిమా ప్రముఖ నటులు కూడా ఉన్నారు. అమ్మ చనిపోయిందని వదంతులు రాగానే ప్రముఖ నటుడు మోహన్‌బాబు స్పందిస్తూ ‘నా తమిళ సోదర, సోదరీమణుల పక్షాన ప్రార్థిస్తున్నాను. ఈ లోటును ఎలా వ్యక్తీకరించాలో మాటలు రావడం లేదు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అంటూ ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

Sandeep kishan

‘అమ్మ’ ఆరోగ్య పరిస్థితిపై వదంతులు వచ్చిన వెంటనే మరో ఆలోచన లేకుండా #RIPAmma, #RIP Jayalalithaa అంటూ ట్విట్టర్‌ వేదికగా నివాళులర్పించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే, మరో ప్రముఖ నటుడు సందీప్‌ కిషన్‌, హాస్యనటుడు వెన్నెల కిషోర్‌ కూడా ఈ వరుసలో చేరారు. అయితే, అనంతరం జయకు ఇప్పటికీ వైద్యం అందిస్తున్నామంటూ అపోలో వైద్య సిబ్బంది మరో హెల్త్‌ బులెటిన్ విడుదల చేసి స్పష్టత నివ్వడంతో మోహనబాబు తన ఖాతాలో ట్వీట్‌ ను తొలగించగా.. వెన్నెల కిశోర్‌ తాను చేసిన ట్వీట్‌ స్థానంలో హెల్త్‌ బులెటిన్‌ పత్రాన్ని ట్వీట్‌ చేశారు. ఇక సందీప్‌ కిషన్‌ కూడా తన ట్వీట్‌ను మార్చేశాడు. అలాగే, బాలీవుడ్‌ నుంచి జయ ఆత్మకు శాంతి చేకూరాలంటూ పలు ట్వీట్లు ట్విట్టర్‌లో దర్శనం ఇస్తున్నాయి. మరోపక్క, జయ పార్టీ కార్యాలయంలో కూడా తొలుత పార్టీ జెండాను కిందకు దించి మరోసారి పైకి ఎగరేశారు.

Sandeep kishan