అనుష్క బెస్ట్ కిస్సర్… కోహ్లీ అదృష్టవంతుడు !

245
Online News Portal
anushka virat kissing
- Advertisement -

ఈ యేడాది దేశ‌వ్యాప్తంగా అంద‌రూ మాట్లాడుకున్న సినిమా ‘ఏ దిల్ హై ముష్కిల్’. ఉరీ ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్థాన్ నటుడు ఫవద్ ఖాన్ నటించిన ఈ సినిమా విడుదలకు దేశ‌వ్యాప్తంగా పెద్ద అడ్డంకులు ఎదుర‌య్యాయి. చివ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సైతం ఈ సినిమా రిలీజ్ విష‌యంలో జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. ఎన్నో అడ్డంకులు దాటుకుని భారీ ప‌బ్లిసిటీ, అంచ‌నాల మ‌ధ్య ఈ సినిమా విడుదలైంది. ఇక చాలా కాలం తర్వాత యంగ్ హీరో రణబీర్ కపూర్ ‘ఏ దిల్ హై ముష్కిల్’ విజయంతో తన ఖాతాలో ఓ హిట్ వేసుకున్నాడు.

ranbir-kapoor-anushka-sharma-kissing-scene_1426738646140

ఈ ఆనందంలో, ప్రెస్ మీట్లలో కూడా ఫుల్ జోష్ తో చాలా కబుర్లు చెబుతున్నాడు. ఈ సందర్భంగా, ఈ సినిమాలో మీతో కలసి నటించిన ఐశ్యర్యా రాయ్, అనుష్క శర్మలలో ఎవరు బెస్ట్ కిస్సర్ అని అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ… ఐశ్వర్యకు తాను ముద్దులు పెట్టలేదని, అనుష్కకే పెట్టానని చెప్పాడు. అనుష్క నిజంగా బెస్ట్ కిస్సర్ అని, ఆమె బాయ్ ఫ్రెండ్ చాలా అదృష్టవంతుడంటూ పరోక్షంగా కోహ్లీకి కాంప్లిమెంట్ ఇచ్చాడు.

- Advertisement -