మొక్కలు నాటిన జనగామ కలెక్టర్‌ నిఖిల..

357
gic

ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి జనగామ కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో మొక్కలు నాటారు జిల్లా కలెక్టర్ కే.నిఖిల. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన నిఖిల మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, వరంగల్ మున్సిపల్ కమీషనర్ పమేలా సత్పతి లకు గ్రీన్ ఛాలెంజ్‌ను ఇచ్చారు.