అనాథలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే గాదరి కిశోర్‌..

273
gadari

మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో తల్లిదండ్రులను కోల్పోయి అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉంటున్న చిన్నారులు నాగలక్ష్మి, సతీష్ లను శుక్రవారం తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గారు కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని నాగలక్ష్మి పేరున రూ. 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయించేందుకు స్థానిక మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి మేఘా రెడ్డి కి నగదు అందజేశారు.

అలాగే తమకు రేషన్ కార్డు ఇప్పించాలని చిన్నారుల అమ్మమ్మ తాత కోరగా తహశీల్దార్ గారికి చెప్పి రేషన్ కార్డు ఇప్పిస్తానని హామీ ఇచ్చి,వారికి తక్షణ సాయంగా రూ 10,000 అందజేశారు.మోత్కూరు జెడ్పిటిసి గోరుపల్లి శారద సంతోష్ రెడ్డి రూ.25,000 సాయం చేసేందుకు ముందుకు రాగా ఆ డబ్బును నాగలక్ష్మి తమ్ముడు సతీష్ పేరు నా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ జెడ్పిటిసి కి సూచించారు.

విద్యార్థిని నాగలక్ష్మి ఫ్రీగా డిగ్రీ ఉచితంగా చదివించేందుకు ముందుకొచ్చిన శ్రీ సంతోష్ డిగ్రీ కాలేజ్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రి మెగా రెడ్డి,వైస్ చైర్మన్ మల్లేపల్లి వెంకటయ్య,మార్కెట్ మాజీ చైర్మన్లు మెగా రెడ్డి చిప్పలపల్లి మహేంద్రనాథ్ టిఆర్ఎస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమేష్ గజ్జి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.