బాబుకు జనసేనాని డిమాండ్స్‌..

191
pawan
- Advertisement -

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..మళ్లీ గళం విప్పారు. ఇప్పటివరకు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై స్వరం పెంచన పవన్‌…తాజాగా కిడ్నీ వ్యాధి గ్రస్తుల సమస్యలపై టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.ఇచ్చాపురం మణికంఠ థియేటర్‌లో కిడ్నీ వ్యాధి గ్రస్తులతో ముఖాముఖి నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నట్టు కేవలం డయాలసిస్ సెంటర్లు పెట్టించి చేతులు దులుపుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నాకు కిడ్నీ బాధితులు ఎలా ఉంటారో తెలుసు…ఆ బాధను స్వయంగా అనుభవించాను కూడా. మా బాబాయ్ చనిపోయారు కిడ్నీ వ్యాధితో. ఆ బాధ నాకు తెలుసు’ అని భావోద్వేగంతో చెప్పారు.

డయాలసిస్ అనేది కిడ్నీ వ్యాధిలో చిట్టచివర చేసే పనిగా పేర్కొన్న ఆయన, ప్రాణాలు పోయేవేళ, దాన్ని పొడిగించేందుకు వాడాలే తప్ప, అదేదో చికిత్స అన్నట్టు, వ్యాధి నుంచి బయటపడేస్తుందన్నట్టు మాట్లాడుతూ ఉండటం దురదృష్టకరమని చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు.

Pawan Kalyan

ప్రజలను ఓటు బ్యాంకుగా తాను చూడడం లేదన్నారు. కిడ్నీ వ్యాధి ఒక విపత్తు అని అభివర్ణించారు. వేలాది మంది దశాబ్దాలుగా చనిపోతున్నా ప్రజాప్రతినిధి ఎందుకు స్పందించలేదన్నారు. పుష్కరాలకు వంద కోట్లు ఖర్చు పెడుతున్నారని, ఉద్దాన్నంలో చనిపోతున్నా..అనాథలవుతున్నా పట్టించుకోకపోవడం చాలా బాధిస్తోందన్నారు.

కిడ్నీ వ్యాధి గ్రస్తుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు జనసేన తరపున 5గురు సభ్యులతో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. 15 రోజుల్లో కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పిస్తానని..తర్వాత పరిష్కారం చేయకపోతే పోరుబాట పడతానని హెచ్చరించారు.

ప్రభుత్వం తరపున మంత్రులతో ప్రత్యేకమైన కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ స్థితిగతులను పరిశీలించాలన్నారు. ఎంత మంది ప్రజలు బాధ పడుతున్నారు ? చికిత్స ఏ విధంగా ఆదుకోవాలో చూడాలన్నారు. 48గంటల్లో అనాథలైన వారికి ఏదో రకమైన ప్రభుత్వం సహాయం చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -