Chandrababu:నీకెన్ని.. నాకెన్ని!

22
- Advertisement -

ఏపీలో రాజకీయాల్లో టీడీపీ జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై గత కొన్నాళ్లుగా అసంబద్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయినప్పటికి సీట్ల కేటాయింపులో మాత్రం పొంతన కుదరడం లేదు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు భేటీ అయినప్పటికి ఎవరికెన్ని అనే దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. అసెంబ్లీ సీట్లతో పాటు లోక్ సభ సీట్ల విషయంలో కూడా ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కచ్చితంగా తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పవన్, చంద్రబాబు తాజాగా మరోసారి సమావేశం అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరుగుతున్న ఈ బేటీ తర్వాత సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

సీట్ల కేటాయింపుపై మాత్రమే కాకుండా ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ మధ్య పొత్తు తో సంబంధం లేకుండా చెరో రెండు అసెంబ్లీ స్థానాలను టీడీపీ, జనసేన పార్టీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాగే ఇరు పార్టీలు స్వతంత్రంగా సీట్లకు ప్రకటిస్తే పొత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధినేతలు భావించినట్లు సమాచారం. అందుకే స్వతంత్రంగా సీట్ల ప్రకటన చేయకుండా.. సర్దుబాటుపై స్పస్టాత వచ్చిన తరువాతే సీట్ల ప్రకటన చేయాలని భావిస్తున్నారట చంద్రబాబు, పవన్. అటువైపు వైఎస్ జగన్ ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటిస్తూ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అందువల్ల సీట్ల ప్రకటన పై ఇంకా ఆలస్యం చేస్తే టీడీపీ జనసేన పార్టీలకు నష్టమే అనే టాక్ వినిపిస్తోంది. ఇక తాజాగా భేటీతో సీట్ల సర్దుబాటుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడంతో ఇరు పార్టీల నుంచి ఆశావాహులు గట్టిగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఎలా జరుగుతుందో చూడాలి.

Also Read:రకుల్ పాత ఫోటో వైరల్

- Advertisement -