‘జంబలకిడిపంబ’ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్‌..

291
Jamba Lakidi Pamba
- Advertisement -

శ్రీనివాసరెడ్డి, సిద్ది ఇద్నాని జంట గా నటించిన చిత్రం ‘జంబలకిడిపంబ’. తాజాగా ఈ చిత్రంలోని ప్రమోషనల్ సాంగ్‌ను రామానాయుడు స్టూడియోలో ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపుడు చేతుల మీదిగా విడుదల చేశారు. ఈ కార్యక్రమం చిత్ర బృంద సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్‌లతో పాటు, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, జబర్దస్త్ అప్పారావు మరియు డైరెక్టర్ జె.బి.మురళి కృష్ణ (మను)లు పాల్గొని తమ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.

director Anil Ravipudi

ఈ చిత్రానికి నేపధ్య సంగీతం గోపిసుందర్ అందించారు. కాసర్ల శ్యాం ఈ ప్రమోషనల్ సాంగ్‌ను రచించగా, సింగర్స్ సాయి చరణ్, రమ్య బెహర ఈ పాటకి గాత్రం అందించారు. ఈ పాట లోని రాప్‌ని రోల్ రైడ రచించి పాడారు. ఈ చిత్రం లో పోసాని మురళి కృష్ణ, వెన్నెల కిషోర్‌, సత్యం రాజేష్, ధనరాజ్, రఘుబాబు, శకలకశంకర్, జయ ప్రకాష్ రెడ్డి, తనికెళ్ళ భరణి, హరితేజ, హిమజ, సుధ, మధుమణి, రజిత తదితరులు ఈ చిత్రం లో నటించారు.

ఈ చిత్రాన్ని రవి, జోజో జోస్, ఎన్‌. శ్రీనివాస్ రెడ్డి, శివమ్‌ సెల్యులాయిడ్స్‌ మరియు మెయిన్‌ లైన్‌ అనే సంస్థల ద్వార ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. B. సురేస్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జూన్ 14న విడుదల చేస్తున్నారు.

- Advertisement -