మోడీ ప్రమాణస్వీకారం: ముగ్గురు కలిసే హస్తినకు..!

379
kcr jagan

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రమాణస్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి. ఈ నెల 30న సాయంత్రం 7 గంటలకు రెండోసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు మోడీ. ఇక అదేరోజు మధ్యాహ్నం నవ్యాంధ్ర సీఎంగా జగన్‌ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు జగన్ ప్రమాణస్వీకారం చేయనుండగా ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు వివిధ పార్టీల నేతలు హాజరుకానున్నారు.

అనంతరం గవర్నర్‌ నరసింహన్‌తో కలిసి కేసీఆర్‌,జగన్ ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో హస్తినకు చేరుకోనున్న వీరు మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

ఇక జగన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఒకరోజు ముందే విజయవాడకు చేరుకోనున్నారు సీఎం కేసీఆర్. 30వ తేదీ ఉదయం కుటుంబసభ్యులతో కలిసి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు కేసీఆర్.